వెంకటాచలం: అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ
By Nagaraju Pattapalli 4చూసినవారుమంగళవారం వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి సెక్టార్‌లో జిల్లా ఐసిడీఎస్ అధికారిణి హేనా సుజన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గొలగమూడి గ్రామంలోని రామ్‌నగర్, కాశీనగరం (అనికేపల్లి) అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, ప్రీస్కూల్ సిలబస్, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ తనిఖీల్లో సీడీపీఓ వి. విజయలక్ష్మి, సూపర్వైజర్ బి. పద్మజ కూడా పాల్గొన్నారు.