వెంకటాచలం: వైసీపీకి ఇక చాన్స్ లేదు

1చూసినవారు
వెంకటాచలం: వైసీపీకి ఇక చాన్స్ లేదు
సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం వెంకటాచలం పీఎసీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చవటపాలెం పీఎసీఎస్ చైర్మన్ రావూరు రాధాకృష్ణమ నాయుడు మాట్లాడుతూ, వైసీపీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని, కాకాణి గోవర్ధన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, ఇక జన్మలో వైసీపీ అధికారంలోకి రాదని, కాకాణి మళ్లీ ఎమ్మెల్యే అవ్వడం అసాధ్యం అని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :