
మనుబోలు: బోల్తా కొట్టిన కారు
ఆదివారం మనుబోలు మండలం, అక్కంపేట మిటాత్మకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అలహాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులు, వారి పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.








































