
అదుపు తప్పిన బైక్.. ఉపాధ్యాయుడికి గాయాలు
వరికుంటపాడు జాతీయ రహదారి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద అదుపు తప్పి స్కూటీ బోల్తా కొట్టడంతో వింజమూరు మండలం నందిగుంట యూపీ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ కరీముల్లా గాయపడ్డారు. వరికుంటపాడు నుంచి వింజమూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఉపాధ్యాయుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.








































