
దుత్తలూరులో ఎస్ఐఆర్ సమీక్ష
దుత్తలూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఉండేల గురువారెడ్డి మంగళవారం దుత్తలూరు టీడీపీ కార్యాలయంలో ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని సమీక్షించారు. మండలంలోని 130, 131, 132 బూత్‌లను సందర్శించి బీఎల్వోలు, పార్టీ బీఎల్ఏలతో కలిసి పురోగతిని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరును గుర్తిస్తూ ఇంటింటి సర్వేను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్వోలకు సూచించారు.







































