కలిగిరి: 48 బైకులు స్వాధీనం

4చూసినవారు
కలిగిరి మండలం పాత ఊరులో పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 48 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. వాహన యజమానులు ధ్రువపత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్