తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ప్రమాదం

3చూసినవారు
తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ప్రమాదం
శుక్రవారం సీతారామపురం మండలం నారాయణపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన హుస్సేన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. గిద్దలూరు మండలం బయన్నపల్లిలో తండ్రి అంత్యక్రియలు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలైన హుస్సేన్‌ను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్