ఉదయగిరి ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న వి. రవిబాబు తన బైక్ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. విధి నిర్వహణ కోసం డిపో ఎదురుగా నిలిపిన ద్విచక్ర వాహనం పని ముగించుకుని వచ్చేసరికి మాయమైందని తెలిపారు. ఎవరైనా పొరపాటున తీసుకెళ్లి ఉంటారనే భావనతో సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.