దుత్తలూరు మండలం నఱ్ఱవాడలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానంలో జూలై 5 నుంచి 9 వరకు శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 5న పసుపు దంచు, 6, 7 తేదీలలో రథోత్సవాలు, 8న కళ్యాణోత్సవం, పసుపు కుంకుమ, రాత్రి ప్రధానోత్సవం, 9న పొంగళ్ళు, ఎడ్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరడమైనది.