ఉదయగిరి: ఇబ్బందికి గురైన ఆర్టీసీ ప్రయాణికులు

66చూసినవారు
ఉదయగిరి: ఇబ్బందికి గురైన ఆర్టీసీ ప్రయాణికులు
ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన ఓ బస్సు నెల్లూరు నుంచి ప్రయాణికులతో గురువారం బయల్దేరింది. ఈ క్రమంలో సంఘం సమీపంలో రాగానే భారీ శబ్దంతో బస్సు టైర్ పంచర్ అయింది. భారీగా శబ్దం రావడంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలోనూ అనేకసార్లు ఉదయగిరి బస్సులు ఇదేవిధంగా పంచర్ అవ్వడం, మొరాయించిన ఘటనలు ఉన్నాయి. దీంతో దూర ప్రాంతాలకు, అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులు అనేకసార్లు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

సంబంధిత పోస్ట్