నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను వాయుగుండం బలపడి కొనసాగుతోంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.