
ఐపీఎల్ ఫైనల్: బెంగళూరులో బహిరంగ సంబరాలపై పోలీసుల నిషేధం
ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా, మే 31న గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఫలితం వెలువడిన తర్వాత బహిరంగ సంబరాలు, బైక్ ర్యాలీలు, రోడ్లను దిగ్బంధించడం, మితిమీరిన హారన్ మోతలు, అనుమతి లేకుండా బహిరంగ ప్రసారాలు, పటాకులు, ప్రమాదకర పదార్థాల వాడకం వంటి వాటిపై నిషేధం విధించారు.




