ఉదయగిరి సబ్ డివిజన్ పరిధిలోని 34 చెరువులకు సంబంధించిన సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి ఇరిగేషన్ డీఈఈ చంద్రమౌళి గురువారం తెలిపారు. ఉదయగి మండలంలో 11, సీతారాంపురం మండలంలో 06, గండిపాలెం ప్రాజెక్టు 17 చెరువులున్నాయి. ఇప్పటికే ఆయా చెరువుల పరిధిలోని ఆయకట్టు రైతుల వన్ బి అడంగళ్ తహశీల్దార్ కార్యాలయంలో అందజేశామన్నారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 3న పరిష్కారం చేస్తామన్నారు.