నక్కలగండి రిజర్వాయర్‌లో మళ్లీ చేపల వేట

4చూసినవారు
నక్కలగండి రిజర్వాయర్‌లో మళ్లీ చేపల వేట
వరికుంటపాడు మండలం నక్కలగండి రిజర్వాయర్‌లో చేపల వేట మూడు రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. అనుమతులపై స్పష్టత లేకపోయినా, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (ఎఫ్డీఓ) మౌఖికంగా అనుమతులున్నాయని చెప్పడంతో వేట మొదలైంది. అయితే, అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో సందిగ్ధత కొనసాగుతోంది. వివాదాలు తలెత్తకుండా పోలీసులు రిజర్వాయర్ వద్ద పహారా కాస్తున్నారు. ఈ రిజర్వాయర్ నుండి టన్నుల కొద్దీ మత్స్య సంపద తరలిపోతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్