ఉదయగిరిలో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు

52చూసినవారు
ఉదయగిరిలో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు
ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ పథకంలో భాగంగా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆర్వో ప్లాంట్ కేటాయించారు. ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకు రాకపోగా ఓ మూలన పడవేశారు. ఈ విషయంపై హెచ్. ఎం ను వివరణ కోరగా ప్లాంటుకు ప్రత్యేక ట్యాంకు, పైపులైను అవసరమని ఈ విషయంపై ఉన్నత అధికారులకు నివేదించామన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్