ఉదయగిరి మండలం బండగానిపల్లి సమీపంలో గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ నక్క మృతి చెందింది. నీటి కోసం అడవి నుంచి జనావాసాల్లోకి నక్క వచ్చుంటుందని స్థానికులు భావించారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకొని వన్యప్రాణులు ఇలా రోడ్లపైకి, జనావాసాల్లోకి రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.