మెంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, అత్యవసరంగా కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలోని SC కాలనీలో గుడిసెలో నివసిస్తున్న బండారు పుల్లయ్య కుటుంబ సభ్యులను మంగళవారం సురక్షిత ప్రాంతానికి తరలించారు. MRO, VRO, సర్పంచ్ మరియు ఇతర అధికారులు వారిని పునరావాస కేంద్రానికి తరలించి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. తుఫానును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు ఇబ్బందులను తెలియజేయాలని సూచించారు.