కొండాపురం మండలం, మక్కినవారిపాలెంలో విద్యుత్ షాక్‌తో పల్లపు చిన్న మాలకొండయ్యకు చెందిన గేదె మృతి చెందింది. మేత కోసం పొలాల్లోకి తీసుకెళ్లినప్పుడు తెగిపడిన విద్యుత్ వైర్ తగలడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ. 80 వేలు విలువైన గేదెను కోల్పోయిన రైతు, విద్యుత్ శాఖ అధికారులను న్యాయం చేయాలని కోరాడు.