ఉదయగిరి మండలం కృష్ణంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల హెడ్‌మాస్టర్ షేక్ సత్తార్ వెల్లడించిన వివరాల ప్రకారం, డి. విష్ణు ప్రియ 580 మార్కులతో మొదటి స్థానం, ఎస్. సల్మాన్ రాజ్ 560 మార్కులతో ద్వితీయ స్థానం, ఎస్. చరిష్మా 550 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. మొత్తం 15 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 99 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.