ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు 10 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో జరిగే ఈ కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. వింజమూరు బొమ్మరాజు చెరువులోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ,
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. 'స్త్రీ శక్తి' థీమ్‌తో మహిళా సాధికారతపై కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రసారాలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.