ఉదయగిరి పట్టణంలో తాగునీటి కోసం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చుక్కల దుప్పిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ప్రాణభయంతో ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరుకున్న దుప్పిని అక్కడి వైద్య సిబ్బంది వెంటనే స్పందించి కుక్కలను తరిమేసి కాపాడారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు దుప్పిని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు.