ఉదయగిరి మండల పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పి. గోపీనాథ్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కలిగిరి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసిన ఆయన, పదోన్నతిపై ఉదయగిరికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రావు మాట్లాడుతూ, కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్చార్జ్ ఎంపీడీవో ఎస్. మోహన్ రావు ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనను అభినందించారు.