వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) ఒంగోలు జిల్లా అధ్యక్షుడు కోమటిగుంట్ల శివ ఇటీవల జరిగిన కత్తి దాడిలో తీవ్రంగా గాయపడి ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతి కుమారి ఆస్పత్రికి వెళ్లి శివ కుటుంబ సభ్యులను పరామర్శించి, వైద్య ఖర్చుల కోసం రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో AVS నాయకులు, విద్యార్థి నేతలు పాల్గొన్నారు.