శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరిలోని బీసీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచే లక్ష్యంతో 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాంలు, పుస్తకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఆరో తరగతిలో ముగ్గురు విద్యార్థులు ప్రవేశం పొందారు. ఒత్తిడి లేని విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని హెచ్‌ఎం తెలిపారు.