సీతారాంపురం: బెట్టింగ్ వల్ల యువకుడు ఆత్మహత్య

8చూసినవారు
సీతారాంపురం: బెట్టింగ్ వల్ల యువకుడు ఆత్మహత్య
సీతారాంపురం మండలం, రంగనాయుడు పల్లికి చెందిన వల్లెపు ప్రతాప్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ. 26 లక్షలు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో అప్పులు చేసి రెండు నెలలుగా ఊరు విడిచి ఉన్న ప్రతాప్, మంగళవారం తన సోదరుడి ఇంటికి వెళ్ళగా, బుధవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్