
BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు bse.ap.gov.in వెబ్ సైట్ నుండి మార్కుల మెమోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.




