బాధిత కుటుంబానికి టీడీపీ నేతల అండ

1చూసినవారు
బాధిత కుటుంబానికి టీడీపీ నేతల అండ
కొండాపురం మండలం గానుగపెంట గ్రామానికి చెందిన జడ రసూల్ కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు పోలినేని చంద్రబాబు నాయుడు రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాను బాధిత కుటుంబానికి అందజేసి, ఇంటి నిర్మాణానికి 100 బస్తాల సిమెంట్ సొంతంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్