నందిపాడులో టీడీపీ యూనిట్ స్థాయి సమావేశం

0చూసినవారు
దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో బుధవారం టీడీపీ యూనిట్ స్థాయి సమావేశం జరిగింది. యూనిట్ ఇన్‌చార్జి చప్పిడి హాజరత్తయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారం, ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, బూత్ స్థాయి బాధ్యతలు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, పీఏసీఎస్ చైర్మన్ మండవ మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్