కలిగిరి మండలంలో ఆలయ చోరీ

3చూసినవారు
కలిగిరి మండలంలో ఆలయ చోరీ
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బుధవారం ఉదయం ఆలయ తలుపులు పగలగొట్టబడి ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆలయంలోకి వెళ్లి పరిశీలించగా హుండీ కనిపించలేదు. అనంతరం సమీప పొలాల్లో ధ్వంసమైన స్థితిలో కనిపించిన హుండీలోని నగదును దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్