మంచిర్యాల రైల్వే స్టేషన్లో జీటీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఉదయగిరికి చెందిన మోగల్ జిలాని (53) అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. శుక్రవారం రైలు స్టేషన్కు చేరుకోగానే ఆమెకు ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అధికారులు 108 అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ కుమార్ తెలిపారు.