సాతానువారిపాలెంకు చెందిన హరేంద్ర తనను రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఉదయగిరికి చెందిన రేష్మ ఆరోపించారు. ప్రియుడు మోహం చాటేశాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆమె వాపోయారు. అధికారులు న్యాయం చేయాలని ఆమె కోరింది. ఈ ఘటనపై యువతి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది.