మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రజాప్రతినిధులతో సరదాగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.