వరికుంటపాడు మండలం గొల్లపల్లి ఎస్టీ కాలనీలో విద్యుత్ తీగలు తగిలి జయంపు నారాయణ గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో నగదు, గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు నష్టపోయాయి. గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. చండ్రా ప్రభాకర్ బాధిత కుటుంబానికి రూ. 5,000 తక్షణ సాయం అందించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందాలని స్థానికులు కోరుతున్నారు.