సబ్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన వరికుంటపాడు సర్పంచ్

13చూసినవారు
సబ్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన వరికుంటపాడు సర్పంచ్
వరికుంటపాడు సర్పంచ్ కొండేపూగు దిలీప్ కుమార్ మంగళవారం కందుకూరు సబ్ కలెక్టర్ దామోదర్ హరివంశీకి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన రెవెన్యూ, ఇతర శాఖల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో, ప్రత్యేక పరిష్కార వేదికను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్, అన్ని శాఖల అధికారులతో చర్చించి వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనుకూలతను బట్టి తప్పకుండా హాజరవుతానని సర్పంచ్‌కు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్