శుక్రవారం వింజమూరు-చాకలకొండ రోడ్డులో బత్తినవారిపల్లె సమీపంలో టిప్పర్ ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై వెళుతున్న యువకుడికి గాయాలయ్యాయి. వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన కె. ఆనంద్ వింజమూరుకు వస్తుండగా, అదుపుతప్పి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ చెయ్యి నలిగిపోగా, చికిత్స కోసం 108 వాహనంలో నెల్లూరు తరలించారు.