Jan 10, 2026, 17:01 IST/
మేరీ కోమ్ సంచలనం: భర్తపై తీవ్ర ఆరోపణలు
Jan 10, 2026, 17:01 IST
భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ తన 20 ఏళ్ల వైవాహిక జీవితం, విడాకులపై తొలిసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం (జనవరి 10) ఓ జాతీయ మీడియా ఛానెల్లో పాల్గొన్న ఆమె, తన మాజీ భర్త కరుంగ్ ఓంఖోలర్ అలియాస్ ఓంలర్ను 'మోసగాడు, అబద్ధాలకోరు' అని ఆరోపించారు. అతను తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు దొంగిలించాడని, తన పేరు మీద అప్పులు తీసుకున్నాడని, పిల్లల పోషణ కోసం కెరీర్ త్యాగం చేశాడనేది అబద్ధమని, అతను విధుల్లో ఫుట్బాల్ ఆడేవాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.