
ఈ-అభ్యాస్ CEO సాయి రామకృష్ణ విద్యార్థులకు స్ఫూర్తి
ఈ-అభ్యాస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర CEO శ్రీ సాయి రామకృష్ణ రాపూర్ లోని ఈనాడు మా జెమ్స్ పాఠశాలను సందర్శించారు. విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా IIT సిలబస్ అందించాలనే లక్ష్యంతో దేశంలోని 4 రాష్ట్రాలలో ఈ-అభ్యాస్ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. విద్యార్థులకు ఎలా చదవాలి, ర్యాంకులు ఎలా సాధించాలి, భవిష్యత్ విద్యా రంగంలో మార్పులు వంటి అంశాలపై ఆయన ప్రేరణాత్మక సందేశం అందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.





































