
15న వెంకటగిరిలో విద్యుత్ అంతరాయం
వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల పనుల కారణంగా ఈ నెల 15న (ఆదివారం) ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ శీనయ్య తెలిపారు. ఈ సమయంలో వెంకటగిరి మున్సిపాలిటీతో పాటు వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.





































