Jan 26, 2026, 16:01 IST/అంబర్పేట్
అంబర్పేట్
హైదరాబాద్: వరకట్నం వేధింపులతో యువతి మృతి
Jan 26, 2026, 16:01 IST
వరకట్నం వేధింపులతో యువతి మృతి కేసులో నలుగురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన ఈ ఘటనలో, సుమయ్యా బేగం (20) అనే యువతిని అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులే ఆమె మరణానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం SC నం. 116/2021గా నమోదు చేసి కోర్టులో విచారణ చేపట్టారు. కోర్టు తీర్పుతో నిందితులకు శిక్ష పడింది.