సోషల్ మీడియాల్లో మ్యాగీ నూడుల్స్‌లో పురుగులున్నాయంటూ వస్తున్న ఆరోపణలను నెస్లే
ఇండియా ఖండించింది. తమ ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన ఫైలింగ్‌లో కంపెనీ స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు నుంచి ఎలాంటి శాంపిల్స్ అందలేదని, NABL పరీక్షల్లోనూ పురుగులు లేవని తేలిందని నెస్లే
ఇండియా వెల్లడించింది. వినియోగదారుల ఆరోగ్యం, నాణ్యత విషయంలో రాజీపడబోమని, కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తామని కంపెనీ తెలిపింది.