పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు
అమెరికా ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ అణు కార్యక్రమంపై కఠిన వైఖరి అవలంబిస్తామని, అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. తమ సైనిక దళాలకు మూడోసారి కూడా దాడులు చేసే సామర్థ్యం ఉందని, గత సైనిక చర్యలను సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తామని, ఇందుకోసం ఇతర దేశాలపై ఆధారపడబోమని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.