AP: ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో తుని-అన్నవరం మధ్య విమానాశ్రయం ఏర్పాటుపై కసరత్తులు జరుగుతున్నాయి. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆదేశించింది. సాధ్యాసాధ్యాలు, భూముల లభ్యత, మౌలిక సదుపాయాలపై అధికారులు త్వరలో నివేదిక అందించనున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కాకినాడ పోర్ట్ నుంచి సరుకు రవాణా వేగవంతం అవుతుంది.