కాకినాడలో కొత్త విమానాశ్రయం.. APADCL కీలక ఆదేశాలు

33చూసినవారు
కాకినాడలో కొత్త విమానాశ్రయం.. APADCL కీలక ఆదేశాలు
AP: రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏఏడీసీ) నివేదిక కోరింది. తుని-అన్నవరం మధ్య విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు జరుగుతున్న నేపథ్యంలో, దాని సాధ్యాసాధ్యాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను త్వరలో సిద్ధం చేసి ఏఏడీసీకి పంపించనున్నారు. ఈ ప్రతిపాదనలు ఏపీలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటులో భాగంగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్