ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌.. నిర్మాణ బాధ్యతలు NBCCకి అప్పగింత

59చూసినవారు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌.. నిర్మాణ బాధ్యతలు NBCCకి అప్పగింత
AP: ఢిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.105 కోట్ల వ్యయంతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన్‌ను నిర్మించనున్నారు. పరిపాలనా కార్యకలాపాలతో పాటు రాష్ట్ర అతిథులకు ఆతిథ్య కేంద్రంగా ఇది సేవలందించేలా రూపకల్పన చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బీసీసీ (NBCC)కి అప్పగించారు.

ట్యాగ్స్ :