ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టింది. లైసెన్సు ఫీజును ఇకపై ఒకేసారి కాకుండా ఆరు వాయిదాలలో చెల్లించుకునే అవకాశం కల్పించింది. ఈ పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. దరఖాస్తుల గడువు ఈనెల 26గా నిర్ణయించారు. లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరగనుంది. కొత్త వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే కాకుండా, బార్ల సంఖ్యను కూడా పెంచారు. ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు నడపడానికి అనుమతి ఇచ్చారు.