గ్యాస్ వినియోగదారులపై కొత్త భారం.. పెరగనున్న ధర?

21104చూసినవారు
గ్యాస్ వినియోగదారులపై కొత్త భారం.. పెరగనున్న ధర?
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కొత్త సెస్ విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరపై అదనంగా సుమారు రూ.18 భారం పడే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్తులో ఇంధన సరఫరా అంతరాయాలను ఎదుర్కొనేందుకు భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఎల్పీజీపై కిలోకు రూ.1.29, నేచురల్ గ్యాస్‌పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1.43 చొప్పున సెస్ విధించవచ్చని సమాచారం.

సంబంధిత పోస్ట్