AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కృష్ణా జిల్లాకు వంగవీటి, తిరుపతికి బాలాజీ, పల్నాడుకు జాషువా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. మరోవైపు పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట పేర్లతో 6 కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 29 నుంచి మంత్రులు అనగాని, జనార్ధన్ రెడ్డి, అనిత, నిమ్మల, సత్యకుమార్‌లు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక అనంతరం సంక్రాంతికి నిర్ణయం వెలువడనుంది.