శ్రీకాకుళం టీడీపీలో వారసుడి ఎంట్రీతో కొత్త సమీకరణాలు?

192చూసినవారు
శ్రీకాకుళం టీడీపీలో వారసుడి ఎంట్రీతో కొత్త సమీకరణాలు?
శ్రీకాకుళం టీడీపీలో వర్గపోరు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మరణానంతరం, అమెరికాలో ఉంటున్న కుమారులు రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు పార్టీలో కొత్త చర్చలకు దారితీసింది. గుండ కుటుంబానికి దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజల్లో మంచి పేరుంది. వారి చిన్న కుమారుడు విశ్వనాథ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నా, ఇకపై శ్రీకాకుళంలోనే ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. చంద్రబాబు గత ఎన్నికల్లోనే వీరిని రాజకీయాల్లోకి ఆహ్వానించినా, అప్పుడు వారు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వారి ఎంట్రీతో శ్రీకాకుళం రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

సంబంధిత పోస్ట్