'అన్‌రీడ్ చాట్ సమ్మరీ' అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా యూజర్లు చదవని మెసేజ్‌ల సారాంశాన్ని ఒకేసారి చూడవచ్చు. మెటా ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేస్తున్న ప్రైవేట్ ప్రాసెసింగ్ సాంకేతికతతో, యూజర్ కోరినప్పుడు మాత్రమే సందేశాలను ప్రాసెస్ చేసి సారాంశాన్ని రూపొందిస్తారు. ఈ ప్రక్రియ సురక్షితంగా ఉంటుందని, మెసేజ్‌ల కంటెంట్‌ను కంపెనీ కూడా యాక్సెస్ చేయదని స్పష్టం చేశారు. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో పరీక్షిస్తున్నారు. పూర్తయ్యాక, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.