మెటా వాట్సప్ వినియోగదారులకు శుభవార్తను అందించింది. మొబైల్ నంబర్ కనిపించకుండానే యూజర్ నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేసే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని, సైబర్ నేరాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. యూజర్ నేమ్ 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండాలి, అందులో ఒక నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక అక్షరం తప్పనిసరిగా ఉండాలి.